ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు..!
PTI PhotoPTI
పిల్లలూ..! ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళ్ళాలో మాకు తెలుసని పక్షులు చెబుతున్నాయండర్రా...! ప్రతి సంవత్సరం పక్షులన్నీ ఒకే సమయానికి టంచనుగా, కాలం మారుతున్నప్పుడు అవి వలస వెళ్ళిపోతాయి. అసలు పక్షుల వలసలు, వాటి కథా కమామీషు ఏంటో చూసేద్దాం రండి.

ఈ పక్షులు అంత ఖచ్చితంగా కాలం మారుతుందని ఎలా తెలుసుకుంటాయి అన్న సందేహం, పక్షులు వలస పోవడం అన్నవిషయమే చరిత్ర మొదటి నుంచీ మానవుడిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.

అయితే... వలస వెళ్ళటం పక్షులకు చాలా అవసరమన్న మాట మాత్రం నిజం. ఎందుకంటే... అవి చలిని తట్టుకోలేనప్పుడు వెచ్చని ప్రదేశాలకు, ఎండను తట్టుకోలేనప్పుడు చలి ప్రదేశాలకు వలసవెళ్ళి తమ మనుగడను సాగిస్తాయి. అంతేగాకుండా.. కొన్ని రకాల పురుగులు, చిన్న చిన్న ఎలుకలు లాంటి ప్రాణులను తినే పక్షులకు చలికాలంలో ఆహారం లభించదు కాబట్టి, తప్పనిసరిగా అవి దొరికే ప్రాంతాలకు వలసవెళ్ళిపోతాయి.

అలాగే... పక్షులు ఎండాకాలంలో పిల్లల్ని కంటాయి కాబట్టి, ఇది కూడా వలసలు వెళ్ళేందుకు కారణాల్లో ఒకటై ఉండవచ్చని పరిశోధకుల అభిప్రాయం. పక్షులలో కొన్ని గ్రంథులు, పిల్లల్ని కనేందుకు సహాయపడే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. అవి వసంత కాలంలోనే పనిచేస్తాయి. తమకు పిల్లల్ని కనే అవసరం ఉందని తెలుసుకున్న పక్షులు ఎండాకాలంలో ఉత్తరం వైపుకు వలసవెళ్తాయి.

ఉదయం నుంచి సాయంత్రం దాకా గడిచే కాలం యొక్క నిడివి, ఆహారం దొరకక పోవడం లాంటి కారణాలు పక్షులకు వెచ్చని ప్రదేశాలకు వెళ్ళమని చెబుతాయి. పిల్లల్ని కనాలన్న ఆలోచన వాటిని ఉత్తరం వైపుకు వెళ్లమని చెబుతుంది. పక్షుల వలసలకు సంబంధించి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ పూర్తిగా తెలియదు. వీటిని శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధిస్తున్నారు.
మరిన్ని
చీమలతో ఆపరేషన్ కుట్లు...!
అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా...?
ఏనుగులకు లెక్కలొచ్చట...!
ఉరితాడునే పూమాలగా ధరించిన భగత్‌సింగ్..!
మీకివి తెలుసా...?!
పిరమిడ్ల (మమ్మీలు) కథ..!