ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > బాలల ప్రేమ మందిరం "జవహర్ బాలభవన్"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాలల ప్రేమ మందిరం "జవహర్ బాలభవన్"
FILE

బాలల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతూ... చిత్రలేఖనం, సంగీతం లాంటి వివిధ రకాలైన కళల్లో, అనుభవజ్ఞులైన వారిచే చిన్నారులకు శిక్షణనిస్తోన్న సంస్థ "జవహర్ బాలభవన్". ఈ సంస్థ 1966 జూన్ 23వ తేదీన హైదరాబాదులో స్థాపించబడింది. చిన్నారుల కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించటమేగాక... పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి, వారికి ప్రోత్సాహకాలుగా బాలశ్రీ, బాలరత్న, బాలసూర్య లాంటి అవార్డులను కూడా ఈ సంస్థ అందజేస్తోంది.

రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధుడైన న్యాయపతి రాఘవరావు, రేడియో అక్కయ్యగా అందరికీ ఆప్తురాలైన శ్రీమతి న్యాయపతి కామేశ్వరిల కృషితో రూపుదిద్దుకున్నదే హైదరాబాదులోని "జవహర్ బాలభవన్". ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడిగా, బాలసాహిత్యవేత్తగా, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తగా, కళాకోవిదుడిగా మరియు రచయితగా బహుముఖ పార్శ్వాలను కలిగి ఉన్నాడు రేడియో అన్నయ్య.

ఓ చెట్టుకు రేడియోను వేళ్లాడదీసి పెద్ద సౌండుతో పాటలు వింటూ కూలినాలి చేసుకునే రోజుల్లోనే... బాలానందం కార్యక్రమాల పేరిట చిన్నారుల గొంతులను ప్రత్యక్షంగా రేడియో ద్వారా పరిచయం చేసి.. వాళ్ల చేత రామాయణ, భాగవతాది పద్యాలనేగాక, అంతర్లీనంగా వున్న కళా ప్రతిభను వెలికితీసి.. రేడియో అక్కయ్య చిన్నారుల హృదయాలలోనేగాక, పెద్దల గుండెల్లోనూ శాశ్వత ముద్ర వేసుకున్నారు.
బాలల నేస్తం రేడియో అన్నయ్య...
  చిన్నారుల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ... మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు      


రేడియో అన్నయ్యతో కలిసి ఆమె చేసిన చిన్న చిన్న నాటికలు శ్రోతల్ని గిలిగింతలు పెట్టేవి. అప్పటికప్పుడే నాటిక రాసేసి, బాలలచేత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్లతో డైలాగులు చెప్పించగలిగేలా, వాళ్లను ప్రయోజకులుగా, ఉత్తమ నటులుగా తీర్చిదిద్దడంలో అక్కయ్యది అందెవేసిన చెయ్యి.

రేడియో అక్కయ్యగా ఆమెకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అయితే మిగతా కార్యక్రమాలను కూడా అక్కయ్య అత్యంత సమర్థవంతంగా ఒంటి చేత్తో నిర్వహించే తీరు అందరినీ ఆశ్చర్యపరిచేది. వృద్ధాప్యం అనేది ఆమెకు వచ్చినా ఆమె గొంతు మాత్రం ఎప్పుడూ నిత్యవసంతంలా తొణికిసలాడక, ఘణఘణమనే గంటలా జనం చెవుల్లో మార్మోగుతుండేది.

న్యాయపతి రాఘవరావు 1905వ సంవత్సరం ఏప్రిల్ 13న ఒరిస్సాలోని బరంపురంలో జన్మించాడు. ఈయనకి బాల్యం నుంచే పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే. పాఠశాల చదువు అనంతరం విజయనగరంలోని మహారాజ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు.

పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసిన రాఘవరావు, ఆకాశవాణిలో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం ద్వారానే ఆయన "రేడియో అన్నయ్య"గా పేరుపొందాడు.

ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్.....పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్యగా పేరొందారు.

ఆటవిడుపు కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పదేళ్లలోపు పిల్లలకి శనివారం బాలానందం అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు.

చిన్నారుల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ... మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు రేడియో అన్నయ్య. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆత్రుతగా వేచి చూసేవారంటే అతిశయోక్తి కాదు.

రేడియో కార్యక్రమాల అనంతరం అన్నయ్య బాలల కోసం "బాల" పత్రికను ప్రచురించాడు. అంతవరకూ పిల్లల కంటూ ఒక పత్రిక లేదు. బాలకేసరి అనే పత్రిక కొంతకాలం వచ్చినా అది వెంటనే ఆగిపోయింది. రేడియో అన్నయ్య పిల్లల పత్రిక అవసరం గుర్తించి 1945లో బాల పత్రిక స్థాపించి బాల సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశాడు. అది కూడా పిల్లలపై అపారమైన ప్రభావాన్ని చూపింది.

రేడియో అన్నయ్య స్థాపించిన ఆంధ్ర బాలానంద సంఘం విజయభేరి మ్రోగించింది. 1956లో హైదరాబాదులో బ్రాంచి కూడా వెలిసింది. అనంతరం ఈ విజయం గ్రహించి బాలబాలికల పత్రికల సంఘాల అవశ్యకతను గుర్తించి అనేక బాలానంద సంఘాలు ఏర్పడ్డాయి. బాలపత్రికలు ఎన్నో వెలిశాయి. ఆ రకంగా ఏర్పడినవే జవహర్ బాలభవన్ (1966), ఆంధ్రప్రదేశ్ బాలలకాడమీ (1976) లు. వీటి స్థాపనకు ఆయన విశేషమైన కృషి చేశాడు.

రేడియో అన్నయ్య కృషి, దీక్ష, తపన, పట్టుదల, పరిశ్రమలతో రూపుదిద్దుకున్న జవహర్ బాలభవన్, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీలు ఇప్పటికీ అనేక చక్కటి కార్యక్రమాలతో చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. సంగీతం, నాట్యం, నాటకం, మేజిక్. హిప్నాటిజం రంగాల్లో కూడా శిక్షణనిస్తూ బాలల దైవమందిరాలుగా అలరారుతున్నాయి.

బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యలకున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఈ పుణ్య దంపతుల ఆశయానికి రూపకల్పనగా... వీరి తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "బాలల అకాడమీ"ని స్థాపించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గ్రాహంబెల్ తొలి "వాణిజ్య టెలిఫోన్ సర్వీసు"
కుహు కుహూ రాగాల "బర్డ్ మేన్" సలీం అలీ
"మిడ్‌నైట్ చిల్డ్రన్" రచయిత జన్మదినం
"హర్యానా హరికేన్" తొలి శతకం నమోదైన రోజు
న్యూయార్క్‌లో ఫ్రాన్స్ బహుమతి "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ"
"లోకల్ షేక్స్‌పియర్" చిలకమర్తి లక్ష్మీ నరసింహం