ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > "కపిల్ డేర్ డెవిల్స్" చరిత్రలో సువర్ణాధ్యాయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"కపిల్ డేర్ డెవిల్స్" చరిత్రలో సువర్ణాధ్యాయం
FILE
"క్రికెట్ మక్కా"గా పేరుగాంచిన ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో, నాటి విశ్వవిజేత వెస్టిండీస్‌ను 1983 సంవత్సరం జూన్ 25వ తేదీన ఖంగు తినిపించిన భారత జట్టు.. తొలిసారిగా క్రికెట్‌లో ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్రలో జూన్ 25ను సువర్ణాక్షరాలతో లిఖించింది. "హర్యానా హరికేన్" అని ముద్దుగా పిలుచుకునే "కపిల్ దేవ్" ఆనాటి టీం ఇండియాకు సారధ్యం వహించి విజయంవైపు నడిపించాడు.

ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌గా పిలువబడ్డ ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. నిర్ణీత 60 ఓవర్లలో భారత జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు మట్టి కరపించి 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ చేసి చిరస్మరణీయమైన విజయాన్ని భారత్‌కి అందించారు.
కపిల్ సేనకు బీసీసీఐ సత్కారం
  తొలి ప్రపంచకప్‌ను సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2008వ సంవత్సరంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు "కపిల్ సేన"ను ఘనంగా సత్కరించింది. ఆనాటి మేటి విజయంలో పాలు పంచుకున్న భారత జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడికి తలా రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేసింది.      


సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పింది. చివరిక్షణం వరకూ తాము ఆనాటి జగజ్జేత వెస్టిండీస్ జట్టుపై ఫైనల్లో గెలుస్తామని అసలు ఊహించలేదని చివరివరకూ పోరాడటమే పనిగా పెట్టుకున్నామని కపిల్ అన్నాడంటే... ఆ రోజు మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు.

ఈ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడూ తన పూర్తి శక్తియుక్తులను ప్రదర్శించి, చక్కటి క్రీడాస్ఫూర్తితో ఆడారంటే అతిశయోక్తి కాదు. ఆనాటి జట్టు విజయంలో లిటిల్ మాస్టర్, మేటి ఆటగాడు అయిన సునీల్ గవాస్కర్ ప్రభావం చెప్పుకోదగ్గది. అలాగే తను ముందుండి మొత్తం జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కపిల్, ఆనాటి జట్టులో అతి పిన్న వయస్కుడైన రవిశాస్త్రిల ఆటతీరు, అలాగే పేరు పేరునా జట్టులోని అందరి సభ్యుల కృషిని మరువజాలం.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"గాలివాన" రచయిత పద్మరాజు జననం
బాలల ప్రేమ మందిరం "జవహర్ బాలభవన్"
గ్రాహంబెల్ తొలి "వాణిజ్య టెలిఫోన్ సర్వీసు"
కుహు కుహూ రాగాల "బర్డ్ మేన్" సలీం అలీ
"మిడ్‌నైట్ చిల్డ్రన్" రచయిత జన్మదినం
"హర్యానా హరికేన్" తొలి శతకం నమోదైన రోజు