ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > ఆసేతు హిమాచలాన్ని తట్టిలేపిన "గీతం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసేతు హిమాచలాన్ని తట్టిలేపిన "గీతం"
FILE

వందేమాతరం... వందేమాతరం

సుజలాం... సుఫలాం

మలయజ శీతలామ్

సస్యశ్యామలాం మాతరం

వందేమాతరం

అంటూ కోటిగొంతులు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా చేసే ఒక్క నినాదం తెల్లదొరలను గడగడలాడించింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నిలిపిన సాధనం, స్వాతంత్ర్యోద్యమకారుల చేతిలో పదునైన ఆయుధం ఈ గీతం. ఇదే నేటి మన భారత జాతీయ గేయం.

ఈ గీతం ప్రముఖ బెంగాలీ కవి, వ్యాస రచయిత మరియు సంపాదకుడు అయిన బంకించంద్ర ఛటోపాధ్యాయ కలం నుంచి జాలువారింది. ఈయన జూన్ 26, 1838వ సంవత్సరంలో జన్మించారు. ఇంతటి గొప్ప జాతీయ గీతాన్ని భారత ప్రజలకు తరిగిపోని ఆస్తిగా అందించిన ఛటోపాధ్యాయ జన్మదినాన్ని చరిత్రలో జూన్ 26వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
గుండె గుండెను తట్టిలేపిన గీతమిది..!
  ఏ దేశభక్తుడిని పోలీసులు అరెస్టు చేసినా.. తెల్లవారి దురహంకారం ఎక్కడ లాఠీలను, తుపాకులను ఝళిపించినా అక్కడంతా ‘‘వందేమాతరం’’ మార్మోగింది. బెంగాల్‌ సరిహద్దులు దాటి అఖండ భారత మొత్తం దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది.      


ఛటోపాధ్యాయ.. తను రాసిన "ఆనంద్ మఠ్" అనే నవల నుంచి వందేమాతరం గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం అహింసాయుత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశభక్తిని ప్రబోధిస్తూ ఒక సమరశంఖంలాగా పనిచేస్తూ జన హృదయాలకు చేరువైంది. స్వాతంత్ర్య కాంక్ష రగిలించేందుకు, దేశభక్తిని ప్రేరేపించేందుకు ఇది బాగా దోహదపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఈ వందేమాతరం గీతాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది.

1870 ప్రాంతంలో బ్రిటీష్‌ పాలకులు వారి జాతీయ గీతాన్ని భారతీయులపై రుద్దేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రజలు తీవ్రంగా అడ్డుకున్నారు. అప్పుడే బంకించంద్ర వందేమాతరం పాటకు రూపకల్పన చేశారు. ఇందులోని పదాలు కష్టంగా ఉన్నాయని... బెంగాలీ, హిందీ, సంస్కృతం మిళితమైందని విమర్శలు వచ్చాయి. బంకించంద్ర మిత్రులు, కూతురు కూడా ఇలాగే స్పందించినా... ప్రజలు మాత్రం ఈ గేయాన్ని ఆదరించారు.

బెంగాల్‌లో స్వాతంత్ర్యోద్యమం ఊపందుకొంటున్న తరుణంలో ఆ రాష్ట్రమంతటా భారీయెత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. వందేమాతరం పాడినవారిని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించింది. ఆ నిషేధం వందేమాతరానికి మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. 1905లో బెంగాల్‌ విభజనకు నిరసనగా జరిగిన ఉద్యమంలో ఈ గేయం కీలకపాత్ర వహించింది.

ఏ దేశభక్తుడిని పోలీసులు అరెస్టు చేసినా.. తెల్లవారి దురహంకారం ఎక్కడ లాఠీలను, తుపాకులను ఝళిపించినా అక్కడంతా "వందేమాతరం" మార్మోగింది. బెంగాల్‌ సరిహద్దులు దాటి అఖండ భారత మొత్తం దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వారూ వీరని కాదు అందరినోట అది వినిపించింది. అందరి గుండెల్లోనూ అది ధ్వనించింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా భారతీయులందర్నీ కదనరంగంలోకి దుమికేలా చేసింది.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"కపిల్ డేర్ డెవిల్స్" చరిత్రలో సువర్ణాధ్యాయం
"గాలివాన" రచయిత పద్మరాజు జననం
బాలల ప్రేమ మందిరం "జవహర్ బాలభవన్"
గ్రాహంబెల్ తొలి "వాణిజ్య టెలిఫోన్ సర్వీసు"
కుహు కుహూ రాగాల "బర్డ్ మేన్" సలీం అలీ
"మిడ్‌నైట్ చిల్డ్రన్" రచయిత జన్మదినం