FREE

On the App Store

FREE

On the App Store

సాహితీ సవ్యసాచి, కవి చిరంజీవి "తిలక్"

Widgets Magazine

FILE
"'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు"...

సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి...

అంటూ.. వచన కవిత్వానికి జిగిని, బిగిని ఒక గుర్తింపును కల్పించి తనదైన శైలిని సమకూర్చుకున్న మేటికవి బాలగంగాధర తిలక్‌. భావకవితలో పుట్టి అభ్యుదయ కవిత మీదుగా అనుభూతి కవితా ప్రస్థానం సాగించిన నవకవితా యాత్రికుడీయన. ఈయన కవిత్వం.. మానవత్వం, అభ్యుదయం కలగలిసిన మిశ్రమ రూపం.

తిలక్ అంటేనే "అమృతం కురిసిన రాత్రి' గుర్తుకొస్తుంది. ఆ కవితలోని నవత గుర్తుకొస్తుంది. నువ్వు లేవు నీ పాట ఉందంటూ... కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాలుగా ఆయన అక్షరాలు మనముందు నిలుస్తాయి. నిశ్శబ్ద నదీతీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగా ఆయన చూపిన ప్రేమైక మూర్తి దర్శనమిస్తుంది. తన రచనలతో తెలుగు కవిత్వగతిని మార్చిన ఈ మహనీయుడి జన్మదినం నేడే..! ఈ సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ....
గాలి మూగదయి పోయింది
గాలి మూగదయి పోయింది పాట బూడిదయి పోయింది వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి నభీస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి.... అంటూ తిలక్ మరణం తరువాత మహాకవి శ్రీశ్రీ స్మృతిగీతం రచించారు...


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు దగ్గర 1921వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన దేవరకొండ బాలగంగాధర తిలక్ జన్మించారు. ఆయన తండ్రి సత్యనారాయణగారికి, "లోకమాన్య బాలగంగాధర తిలక్"పై ఉన్న అభిమానంతోనే మన తిలక్‌కు బాలగంగాధర తిలక్‌గా ఆ నామకరణం చేశారు. తణుకుకు చెందిన పెన్మెత్స సత్యనారాయణరాజు తిలక్‌కి గురువు. ఆయన వద్దనే ఛందస్సు, వ్యాకరణం, ప్రబంధాలను ఈయన నేర్చుకున్నారు.

తిలక్ ఎంత సుకుమారుడో ఆయన కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం.

అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి తిలక్ కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నారు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు... బిచ్చగాళ్ళు, అనాధులు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తేలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

బాలప్రపంచం

పిల్లలు అన్నం తినమని మారాం చేస్తున్నారా?

పిల్లలు అన్నం తినమని మారాం చేస్తున్నారా.. అయితే ఈ కథనం చదవండి. పిల్లలకు అన్నం ...

పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తున్నారా..?

హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా ...

పరీక్షా సమయం.. ఆఖరి క్షణంలో రివిజన్

పరీక్షల సమయంలో అందరూ రివిజన్ చేయడం మామూలే అయితే అది ఏ విధంగా చేస్తున్నామన్నదే ముఖ్యం. ...

టీనేజ్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

టీనేజ్‌లో పిల్లలకు పోషకాహారం ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆహారం ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం.. చర్చకు వస్తేనే వెళ్తాం: జగన్

శుక్రవారం నుంచి అసెంబ్లీకి వెళ్లట్లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సభాపతి కోడెల ...

ఎవరి ధీమా వారిది... గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ఫైట్

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న శాసనమండలి ఎన్నికలలో ఎవరి ధీమా వారిదే.. ...

లేటెస్ట్

ఎవరి సొత్తో లాక్కెళుతున్నట్లు ఎందుకంత భయం... రాజేంద్రప్రసాద్

సేవ చేసేందుకు మా అధ్యక్ష పదవిని కోరుకుంటుంటే చాలామంది తామెవరిదో సొత్తు లాక్కెళ్లిపోతున్నట్లు ...

హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ఖాన్ ఎట్టకేలకు బోనెక్కి సరికొత్త సాక్ష్యం ఇచ్చాడు. 2002లో కారు ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

Kandula sisters

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine
Widgets Magazine