కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జనరల్ నాలెడ్జ్ » నేడు "అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం" (GK | November | Children's Day | International Children's Film Festival | International Children's Rights)
Feedback Print Bookmark and Share
 
Children
FILE
నవంబర్ నెల అనగానే బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల హక్కుల దినోత్సవం... ఇలా నెల మొత్తంమీదా బాలలకు పండుగ రోజులే..! ఇందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని పిల్లలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

1959వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా ప్రపంచమంతటా బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. ఇదే రోజునే బాలల హక్కుల దినోత్సవంగా కూడా పాటిస్తున్నారు.

పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకుగాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్‌ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది.

కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలల హక్కులు ప్రాధమిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడ్డం అనేది కేవలం అచరణ సాధ్యంకాని పనిగా కనిపిస్తోంది.

బాలల హక్కులపై ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న స్వచ్చంద సంస్ధలు బాలలను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలు స్వదేశి, విదేశి నిధులు దుర్వినియోగపరుస్తున్నారే తప్ప వీరి హక్కులు కాపాడేందుకు ఏ ఒక్కరూ చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేయడం లేదనే అరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.

బాల కార్మిక చట్టాలు, బాలల హక్కుల చట్టాలు కొంత మందికి చుట్టంగానే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా బాలలు ఎక్కువగా ప్రమాదకరమైన పనుల్లో కనిపించడం అలా పనుల్లో పెట్టుకున్న వారిపై కేసుల నమోదులు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.