పిల్లలు పెరుగుతున్న ప్రస్తుత వాతావరణం, వారిని ప్రకృతిని దూరం చేస్తున్నది. ప్రకృతిలోని అద్భుతాలను, అందాలను దగ్గరగా చూసే అవకాశాన్ని పిల్లలు పొందలేక పోతున్నారు. అలాగే మనకు నచ్చిన, అనువైన పరిసరాలను, పరిస్థితులను చూస్తే కలిగే ఆనందం, పొందే అనుభూతి వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో తనకు అనుకూలమైన ఇంటిని వెదుక్కునే క్రమంలో గోలా అనే జడల బర్రె రకరకాల ప్రాంతాలను సందర్శించిన వైనాన్ని, అక్కడి వాతావరణ పరిస్థితులను రచయిత్రి చిత్రా సౌందర్ కనులకు కట్టినట్లుగా వర్ణించారు. రచయిత్రి కథనానికి మరింత విలువను చేకూర్చేలా ప్రియా కురియన్ అందమైన చిత్రాలను అందించారు, రచయిత్రి కథను విజయలక్ష్మీ వేదుల తెలుగులోకి చక్కగా అనువదించారు.
అనగా అనగా చెప్పుకుంటే పోతే ఒకానొక కాలంలో జడల బర్రెలకు ఇళ్ళుండేవి కావు, ఉండటానికి ఇల్లు లేకపోవడంతో గోలా అనే జడల బర్రె ఇళ్ళ వేటలో పడుతుంది. గోలా స్నేహితురాలైన మురి అనే రాబందు, గోలాకు ఇల్లు వెదికిపెట్టే బాధ్యతను చేపడుతుంది. సముద్రం, నది, ఎడారి మరియు అడవిని చూసిన గోలా, అవి తనకు అనువుగా లేవని నీరసపడుతుంది. ఆ తర్వాత చూసిన మంచుపర్వతాలను చూసి ఆనందంతో గంతులేసిన గోలా అవే తన నివాసమని తేల్చేస్తుంది. రచన పేరు: ఎక్కడ ఉంది గోలా ఇల్లు? రచన: చిత్రా సుందర్ వెల: రూ. 80 ప్రచురణ: తులికా పబ్లిషర్స్, 13 పృథ్వీ ఎవెన్యూ, అభిరామపురం, చెన్నయ్ - 600 018
|