'అన్యాయం.. చాలా అన్యాయం.. రేపటినుంచి నేను స్కూలుకు పోనంటే పోను... డంకా భజాయించి చెప్పాడు వినోద్. అంత అన్యాయం ఏ జరిగిందిరా నీకు...' అడిగాడు తండ్రి. 'మరే.. మా టీచరేమే శుభ్రంగా పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్నేమో చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది. అన్యాయం కాదా మరి..' ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు వినోద్.
|