" ఈరోజు కూడా స్కూల్‌కి లేటుగా వచ్చావేంట్రా...?!" కోపంగా అడిగింది టీచర్" మమ్మీ గోడకుర్చీ వేయమంది మేడమ్... అందుకే లేటయ్యిందండీ..." చెప్పాడు బన్నీ" ఏం తప్పుచేశావేంటి..?"" నేనేం తప్పు చేయలేదు మేడమ్... మాడాడీ కూరలో ఉప్పు తక్కువగా వేశారట. అందుకని ఆయన్ని గోడకుర్చీ వేయమంది మమ్మీ. మా డాడీ గోడకుర్చీ వేసి, ఆ తరువాత నన్ను స్కూల్లో తీసుకొచ్చి వదిలేటప్పటికీ లేటయ్యిందండీ...!!" |