ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్ దనవారి కెంత గలిగిన తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!
తాత్పర్యం : ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ మహేశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి... తన స్నేహితులకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనకు ఉపయోగపడదు. మన భాగ్యమే మనకు ఉపయోగపడుతుందని ఈ పద్యం యొక్క భావం.
|