మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు బరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం : కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లుతుంది. అదే విధంగా పెద్దవారైన గురువులు బయటికి ఆడంబరంగా కనిపించక పోయినప్పటికీ వారు గొప్పగుణములు కలిగినవారై ఉంటారని చెబుతున్నాడు వేమన మహాకవి.
|