ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > అమ్మచేతి చలువ..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమ్మచేతి చలువ..!
FileFILE
అమ్మ కన్న మంచిదీ
ఆమె వంటి పెన్నిధీ
ఎంత వెదకి చూచినా
లేదు లేదు ఎందునా...!

అమ్మ కంటి వెలుగుతో
ఆమె చేతి చలువతో
బ్రతుకు పూలు పూయదా?
సతము ఫలము లీయదా....?

అమ్మ మనసు ప్రేమలో
ఆమె మాట తీపిలో
అమృతమ్ము తొణకదా?
అమర సుఖము దొరకదా....?!
మరిన్ని
సేనా నాయకత్వం..!
బుద్ధి ప్రధానంబు...!
మృగమదంబు జూడ..!
ధనపతి సఖుడై..!
జనులు లెక్కచేయరు!
కులం కంటే గుణం మిన్న..!