శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ..!
తాత్పర్యం : రఘువంశంలో పుట్టినవాడవు, సొంపైన తులసీదండలు కలిగినవాడవు, శాంతి, ఓర్పు మొదలగు గుణాలను కలిగినవాడవు, మూడు లోకాలూ పొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా...! ఎవరూ ఏమీ చేయలేని కబంధుడనే రాక్షసుడిని చంపినవాడా, ప్రజలను పాపాలనే సముద్రాలను దాటించే పేరు కలిగినవాడా...! దయకు సముద్రం లాంటివాడా...! భద్రాచలములో ఉండే శ్రీరామా...! అని శ్రీరామచంద్రుడిని కొనియాడుతున్నాడు భక్త రామదాసు.
|