తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం : తలయందు పామునకు, తోక నందు తేలునకును విషముండును. కానీ.. దుర్మార్గులకు తల, తోకయను నియమము లేక, శరీరమందంతటను విషముండునని ఈ పద్యం యొక్క భావం.
|