అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
తాత్పర్యం : సత్యము మాట్లాడేవాడివి, శరణన్న వారిని రక్షించేవాడవు, దయచేత పాపములను పోగొట్టువాడవు, బ్రాహ్మణులను సంతోష పెట్టెడివాడవు, గంగానది పుట్టిన పాద పద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెరిసే నగలు కలవాడవు అయిన భద్రాచల శ్రీరామా...! అంటూ శ్రీరామచంద్ర మూర్తిని కీర్తిస్తున్నాడు రామదాసు.
|