సీతాకోక చిలుకా నీకోక ఎవరిదమ్మ రంగుల రెక్కల రతనాల చిలుకా పూలే నీ నేస్తాలమ్మా, మకరందమే నీ ఆహారమమ్మా నీ రంగుల రూపమే హరివిల్లమ్మా
రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది
చిలుకా చిలుకా సీతాకోక చిలుకా పలుకూ పలుకూ మాతోనైనా పలుకు వినవా వినవా పూల మాట వినవా తినవా తినవా తీయని తేనెను తినవా..!
|