ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > శ్రీరాముని దయచేతను
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీరాముని దయచేతను
FileFILE
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ...!

తాత్పర్యం :
సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములో నీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి... మరలమరల చదువ వలెను అనే ఆశ కలుగునట్లుగా వచించుచున్నానని ఈ పద్యం యొక్కం భావం.
మరిన్ని
శూరుడు కాలేడు!
దాశరథీ కరుణాపయోనిధీ..!
మిరపగింజచూడ..!
రారమ్మని పిలువని...!
శివపూజలేలరా?
ఎల్లప్పుడూ మా నోట..!