కమలములు నీరు బాసినగమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్దమతమ నెలవులు దప్పినదమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ...!తాత్పర్యం :తామర పుష్పాలు తమ స్థానమైన నీటిని వదిలినట్లైతే.. వాటి మిత్రుడైన సూర్య దేవుడి ప్రతాపాగ్నిచేత వాడిపోయి మరణిస్తాయి. అలాగే ఎలాంటి వ్యక్తులైనప్పటికీ వారి ఉనికిని విడిచిపెట్టినట్లైతే, వారి స్నేహితులే విరోధులవుతారని ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతకకారుడు. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|