అందమైనది మా ఇల్లు... ఆనందానికి హరివిల్లుఇంటి ముందర బాట... ఇంటికి వెనుక తోటమా ఇల్లు ఒక కోట... గర్విస్తుంది మా పేటఅందమైనది మా ఇల్లు... ఆనందానికి హరివిల్లుఅమ్మా నాన్న అన్నయ్య... తాతా బామ్మా మామయ్యజూలీ డాలీ రంగయ్య... మా ఇంట్లోని వాళ్లయ్యఅందమైనది మా ఇల్లు... ఆనందానికి హరివిల్లుశాంతికి నిలయం మా ఇల్లు... ప్రేమకు వలయం మా ఇల్లుస్వచ్ఛత అంటే మా ఇల్లు... క్రమశిక్షణకు మా ఇల్లుఅందమైనది మా ఇల్లు... ఆనందానికి హరివిల్లుఇంటికి రాజు మా నాన్న... నాన్నకు తోడు మా అమ్మఇంటికి రాణి మా అమ్మ... అమ్మకు తోడు అమ్మమ్మఅందమైనది మా ఇల్లు... ఆనందానికి హరివిల్లు..!! |