ఉన్నఘనతబట్టి మన్నింతురేకానిపిన్న, పెద్దతనము నెన్నబోరువాసుదేవు విడిచి వసుదేవు నెంతురా?విశ్వదాభిరామ.. వినుర వేమా...!!తాత్పర్యం :మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే, సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయసుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికంటే, ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే.. దానికి శ్రీకృష్ణుడి గొప్పగుణాలే కారణమని ఈ పద్యం యొక్క భావం. |