ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > గంధము పుయ్యరుగా...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గంధము పుయ్యరుగా...!!
FILE

గంధము పుయ్యరుగా పన్నీరు "గంధ"
అందమైన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ "గంధ"

తిలకము దిద్దరుగా కస్తూరి "తిల"
కలకలమను ముఖకళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడు స్వామికి "గంధ"

చేలము కట్టరుగా బంగారు "చేల"
మాలిమితో గోపాల బాలులతో
అలమేపిన విశాలనయనునికి "గంధ"

హారతులెత్తరుగా ముత్యాల "హార"
నారీమణులకు వారము యౌవన
వారక మొసగెడు వారిజాక్షునకు "గంధ"

పూజలు సేయరుగా మనసార "మన"
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునకు "గంధ"
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం
తాను భుజింపని యర్థము
తారంగం తారంగం.. తాండవ కృష్ణా తారంగం
ఉన్నఘనతబట్టి మన్నింతురే...!
కాకమ్మ దాహం తీర్చిన కుండమ్మ..!
కోపమునను ఘనత కొంచమైపోవు...!