ఎంత సదివిన నేమివినిన తనచింత యేల మాను సిరులేల కలుగుఇతర దూషణములు ఎడసిన గాకఅతి కాముకుడు గానియప్పుడు గాకమతి చంచలము గొంత మానిన గాకగతియేల కలుగు దుర్గతులేలమాను "ఎంత"పరధనముల యాస పాసినగాకఅరిది నిందలులేని యప్పుడు గాకవిరసవర్తనము విడచిన గాకపరమేల కలుగు నాపద లేలమాను "ఎంత"వేంకటపతి నాత్మ వెదకిన గాకకింక మనసున దొలగిన గాకబొంకు మాట లెడసి పోయిన గాకశంక యేలమాను జయమేల కలుగు "ఎంత" |