చిట్టి మా అమ్మాయి శ్రీ ముఖము చూసిసిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచుపందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటేపనసపండని జనులు పరుగులెత్తేరుదొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటేదోసపండని జనులు దోసిలొగ్గేరునీలాలు కెంపులూ నిలువు వజ్రాలునిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోటపగడాలు రత్నాలు పారిజాతాలుపడలి మా అమ్మాయి పనిచేయుచోటచూడగా ముద్దమ్మ పాడగా ముద్దుఅందరికీ మా అమ్మి అల్లారు ముద్దు |