బ్రహ్మ గడిగిన పాదముబ్రహ్మము తానె నీ పాదము "బ్రహ్మ"చెలగి వసుధ గొలిచిన దీ పాదముబలి తల మోపిన పాదముతలకక గగనము తన్నిన పాదముబలరిపు గాచిన పాదము "బ్రహ్మ"కామిని పాపము కడిగిన పాదముపాము తల నిడిన పాదముప్రేమపు శ్రీసతి పిసికెడి పాదముపామిడి తురగపు పాదము "బ్రహ్మ"పరమ యోగులకు పరిపరి విధములవర మొసగెడి నీ పాదముతిరు వేంకటగిరి తిరమని చూపినపరమ పదము నీ పాదము "బ్రహ్మ" |