రామా లాలీ మేఘశ్యామా లాలీతామరసనయన దశరథతనయా లాలీ "రామ"అబ్జవదన ఆటలాడి అలసినావురా నీబొజ్జలో పాలరుగగానే నిదురబొవేరా "రామ"అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూముద్దుపాపలున్నారని మురిసి చూచేవూ "రామ"ఎంతో యెత్తు మరగినావు యేమి సేతురాఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా "రామ"జోలపాడి జోకొడితే ఆలకించేవుచాలించి మరియూరకుంటే సైగలు చేసేవు "రామ"వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవుతిన్నగ సేవించవయ్య తియ్యగ నుండు "రామ" |