ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ..!
FILE

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చందమామ తెలుపు.. సన్నజాజి తెలుపు...!!
తరగల్ పిప్పలపత్రముల్...!
రామా లాలీ మేఘశ్యామా లాలీ...!
బ్రహ్మ కడిగిన పాదము...!
చిన్నారి పాప అల్లారు ముద్దు
నేరనన్నవాడె నేర్పరి మహిలోన...!