సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమైయున్నపుడైన లోకులకు నొండొక మేలొనరించు సత్వసంపన్నుడు భీము డా ద్విజుల ప్రాణము కావడె ఏకచక్రమందెన్నికగా బకాసురుని నేపున రూపుడగించి భాస్కరా....!!తాత్పర్యం :భీముడు బ్రాహ్మణ వేషంలో అజ్ఞాతంగా గడపాల్సి వచ్చిన సమయంలో కూడా ఏకచక్రపురంలోని బ్రాహ్మణ కుటుంబాన్ని బకాసురుని బారినుంచి రక్షించగలిగాడు. కాబట్టి... కార్యదక్షుడైనవాడు ఏ కారణం చేతనయినా తన గొప్పతనమును మరుగు పరచుకోవాల్సి వచ్చినప్పటికీ... ఇతరులకు తన చేతనైనంత మేలు ఏదయినా సరే చేయగలడని భావం. |