కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » భర్తృహరి సుభాషితం : తరువు లతిరసఫలభార..! (Kids world | poems | help | batruhari | enugu lakshmana kavi | telugu)
 
FILE
తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!

తాత్పర్యం :
ఎవరికైనా మేలు చేస్తున్నప్పుడు "పరోపకారార్థమిదం శరీరమ్" అంటుంటారు చాలామంది. ఇతరులకు ఉపకారం చేసేందుకే ఈ శరీరం ఉన్నది అని దీని అర్థం వచ్చే ఈ వాక్యం మూలం భర్తృహరి సుభాషితాల్లో కనిపిస్తుంది. పరోపకారం మంచివారి సహజ లక్షణం అంటూ భర్తృహరి చెప్పిన పై పద్యాన్ని ఏనుగు లక్ష్మణకవి తేటతెలుగు మాటల్లో అలా వర్ణించారు.

బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క భావం.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.