కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » పరహితమైన కార్య మతి భారము...! (Kids world | poems | people | good | lord sri krishna | cows | poem | meaning)
 
Man
FILE
పరహితమైన కార్య మతి భారముతోడిదియైన పూను స
త్పురుషుడులోకము ల్పొగడ, పూర్వమునం దొక రాలవర్షమున్
కురియగ చొచ్చినన్ తగిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా...!!

తాత్పర్యం :
ప్రజలకు మంచి చేసే పని.. అది ఎంత కష్టమైనది అయినప్పటికీ మంచివాడు దాన్ని చేసేందుకు పూనుకుంటాడు. పూర్వకాలంలో రాళ్ల వర్షం కురిసినప్పుడు పశువులను, వారి రక్షకులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండనే చేతితో ఎత్తుకుని గొడుగులాగా పట్టాడనని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి.. ప్రజలకు మంచి చేసే ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకూడదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.