కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » ఆడి తప్పువార లభిమానహీనులు..! (Kids World | Poems | Friendship | Love | Meaning | Poem | Vemana | Poet)
Feedback Print Bookmark and Share
 
Man
FILE
ఆడి తప్పువార లభిమానహీనులు
గోడెడురగనివాడు కొద్దికాడు
కూడి కీడు సేయు క్రూరుండు తలపోయ
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
మాట ఇచ్చి తప్పేవాడు సిగ్గులేనివాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోనివాడు అల్పుడు. స్నేహం చేసి నమ్మించి హానిచేసేవాడు క్రూరుడని ఈ పద్యం యొక్క భావం. అంటే.. తియ్యగా మాట్లాడటమేకాదు దాంట్లో సత్యముండాలి. ఎదుటివారి బాధకు జాలి చూపించటం కాదు, అర్థం చేసుకుని సాయపడాలి. అనుబంధం నటించి హానిచెయ్యటం కాదు, దానిని నిర్మలంగా కొనసాగించాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.