కూరిమి గల దినములలో..!

కూరిమి గల దినములలోనేరములెన్నడును గలుగ నేరవు మఱి యాకూరిమి విరసంబైననునేరములే తోచుచుండు నిక్కము సుమతీ..!తాత్పర్యం :మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. అదే వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు వారు చేసే మంచి పనులు కూడా చెడ్డవిగానే కనిపిస్తాయని ఈ పద్యం యొక్క భావం. సంబంధిత సమాచారం కోసం శోధించండి.