కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » నీళ్లమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు..! (Poems | Water | Ship | Speed | Talent | Poet | Vemana)
Feedback Print Bookmark and Share
 
Kid
FILE
నీళ్లమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బయట మూరెడైన పారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
నీటిమీద ఓడ ఎంతో వేగంగా దూసుకుపోతుంది. అదే నీటి బయట అయితే అది మూరెడు దూరం కూడా ముందుకెళ్లలేదు. అలాగే.. పరిస్థితులు అనుకూలంగా లేనిచోట మనలో ఎంత నేర్పరితనం ఉన్నప్పటికీ ఏమీ చేయలేము. ఏదైనా సాధించేందుకు మనలో ఆ సామర్థ్యం ఉండాల్సిందే. అయితే దానికితోడు అందుకు పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని ఈ పద్యం యొక్క సందేశం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.