పిల్లలూ...! ఈరోజు మనం ఆపద సమయాల్లో మెళకువగా ఎలా ఉండాలో తెలియజెప్పే ఓ చిన్న కథను తెలుసుకుందాం...!
సింహాచలం అనే ఊర్లో ఒక పెద్దావిడ ఉండేది. ఆమెకు నలుగురు కూతుళ్ళు. ఉన్నంతలో నలుగురి కూతుళ్ళకు బాగానే పెళ్లి జరిపించింది. తాను సంపాదించిన మొత్తాన్ని నలుగురు కూతుళ్ళకు సమానంగా పంచింది పెద్దావిడ. అయితే ఆమె ఎలా బ్రతకాలి అన్న సమస్య రావడంతో నలుగురు కూతుళ్ళ వద్దా మూడు నెలలపాటు ఉండాలని నిర్ణయించుకుంటుంది.
మొదటగా పెద్దకూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ, రెండో కూతురు ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ అడవి గుండా ఆమె నడచి వెళ్తుంటుంది. ఆ అడవిలోనే పులి ఒకటి తిరుగుతూ ఉండేది. నరవాసనను గుర్తుపట్టిన ఆ పులి పెద్దావిడ దగ్గరకు వచ్చేసింది. | | ఆపద సమయాల్లో ఉపాయంతో, తెలివితో మసలడం అందరూ నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే జీవితం ఆనందమయమవుతుంది. |
| |
పెద్దావిడను తినేసేందుకు మీదపడింది. అయితే మంచి యుక్తి, వయసుకు తగిన తెలివితేటలు కలిగిన పెద్దావిడ నేర్పుగా పులితో ఇలా అంది. "పెద్ద పులీ...! పెద్ద పులీ...! నేను బాగా ముసలిదాన్నయిపోయాను, బాగా చిక్కిపోయాను, ఆరోగ్యం కూడా బాగలేదు... ఇప్పుడు నేను రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ పది రోజులు ఉంటాను. బాగా తినేసి ఒళ్ళుచేసి వస్తాను. అప్పుడు నన్ను తిందువుగానీ..." అని చెప్పింది.
పెద్దావిడ మాటలను నమ్మిన పులి అప్పటికి వదిలి పెట్టింది. కానీ పెద్దావిడ రెండో కూతురు ఇంటికి వెళ్ళి పదిరోజులు, పదిహేనురోజులు గడిచి, నెల కూడా పూర్తవుతుంది. అయినా ఆమె రాదు. ఎలాగైనా రాకపోతుందా, వెళ్ళేందుకు ఇదే దారి కదా.... అప్పుడు ఆమె పని పడతానని బీష్మించుకు కూర్చుంది పెద్దపులి.
రెండో కూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ మూడో కూతురి ఇంటికి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయలు దేరే రోజు దగ్గర పడుతుండగా తనకు పులితో తనకు ఎదురైన పరిస్థితి గురించి రెండో కూతురితో పూసగుచ్చినట్లు చెప్పింది.
|