మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంటుంది. ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతుంటాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ అందమైన వనంలో సంతోషంతో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది.
బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క. వెంటనే మెల్లగా లేడి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని కుళ్లును బయటకు పడనీయకుండా మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని విలపించింది నక్క.| కొత్తవాళ్లను నమ్మకూడదన్న కాకి |
| | మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో, కొత్తవారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి.... |
| |
అంతేగాకుండా నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది.
వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది. అతడెవరు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి. అప్పుడు లేడిపిల్ల ఈనక్క దిక్కులేనివాడని, తనతో స్నేహంకోరి వచ్చాడని చెబుతుంది.
అంతా విన్న కాకి.... మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో, కొత్తవారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది.
|