ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథలు > గాడిద తిక్క కుదిర్చిన కుక్క
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గాడిద తిక్క కుదిర్చిన కుక్క
Shoba
FileFILE
సీతాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర ఒక గాడిద, కుక్క ఉండేవి. అయితే ఈ రెండూ ఎప్పుడూ సఖ్యంగా ఉండేవి కావు. గాడిదకు కుక్క అంటే అంతగా సరిపడేది కాదు. యజమాని కోసం ఎలాగోలా కుక్కను భరిస్తూ ఉంటుంది.

వ్యాపారం కోసం సరుకులను గాడిదపై వేసుకుని రామయ్య ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేవాడు. అలా వెళ్లేటప్పుడు కుక్కను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. అలా ఒకరోజు వ్యాపారం కోసం వెళ్తూ... ఎండలు మండిపోతుండటంతో విశ్రాంతి కోసం ఓ చెట్టు దగ్గర ఆగుతాడు.
ఆకలిగా ఉంది... ఇలా కూర్చోవూ...!
  కుక్కకు బాగా ఆకలిగా ఉండటంతో... "మిత్రమా.... నువ్వు కనీసం దారిలోనయినా పచ్చగడ్డి తిన్నావు. నాకు ఏమీ దొరకలేదు కదా...! బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఇలా కూర్చుంటే నీ వీపుపైన ఉన్నరొట్టెముక్కలను తీసుకుని తింటాను." అంటూ గాడిదను బ్రతిమలాడింది.      


బాగా అలసటగా ఉండటంతో రామయ్య కూర్చున్న చోటనే నిద్రలోకి జారుకున్నాడు. గాడిద, కుక్క రెండూ కూడా యజమానిని కనిపెట్టుకుని చెట్టుకిందే ఆగిపోయాయి. అయితే, ఈ రెండింటికి బాగా ఆకలి వేస్తుంటుంది. బాగా నిద్రలో ఉన్న యజమానిని లేపితే కోప్పడతాడనుకుని చేసేదేంలేక అలాగే ఉండిపోతాయి.

దారిలో అక్కడక్కడా పచ్చగడ్డి కనిపించడంతో, దాంతో కడుపునింపుకున్న గాడిదకు మాత్రం అంతగా ఆకలి ఉండదు. కానీ కుక్కకు మాత్రం బాగా ఆకలిగా ఉండటంతో... "మిత్రమా.... నువ్వు కనీసం దారిలోనయినా పచ్చగడ్డి తిన్నావు. నాకు ఏమీ దొరకలేదు కదా...! బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఇలా కూర్చుంటే నీ వీపుపైన ఉన్నరొట్టెముక్కలను తీసుకుని తింటాను." అంటూ గాడిదను బ్రతిమలాడింది.
1 | 2  >>  
మరిన్ని
మీరు చేసే పనే... నేనూ చేస్తున్నా..!
పంచతంత్రం కథలు... మిత్రలాభం
సూర్యదేవుడిపై జమదగ్ని యుద్ధం
ఇకనైనా హాయిగా నిద్రపో...!
బీర్బల్ కథలు... దొంగ సాధువు
పంచతంత్రం కథ... ఉత్తమ మిత్రుడు...!