కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » నిజమైన బంధువు, మిత్రుడు.. "భగవంతుడే"..! (Kids World | Stories | Teacher | Student | Simhabaludu | Dhananjaya Muni | Wife | Mother | Childern's)
 
God
FILE
ఒక ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న సింహబలుడికి "ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారంతా నామమాత్రపు వారే"నని గురువు ధనంజయ ముని బోధించాడు. అయితే సింహబలుడికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అదే విషయాన్ని గురువుతో అన్నాడు.

"నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ తనను ఎంతో శ్రద్ధతో, భక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేనిదే వారు ఒక క్షణమైనా నిలువలేరు. వారి ప్రేమను నేనెలా శంకిస్తాను..?" అని గురువును ప్రశ్నించాడు సింహబలుడు. "నాయనా.. వారి ప్రేమ తాత్కాలికమైనది. అది నిజమని, శాశ్వతమని తలచటం అవివేకం. ఈ విషయాన్ని నేను నీకు ప్రత్యక్షంగా నిరూపించి చూపిస్తాన"ని అన్నాడు.

వెంటనే కొన్ని మాత్రలు తీసి సింహబలుడి చేతిలో పెట్టిన ధనంజయ ముని... "ఇంటికి వెళ్లి తాను చెప్పినట్లగా, ఈ మాత్రలు మింగి పడుకో. కాసేపటికి నువ్వు చనిపోయినట్లు పైకి కనిపించినా.. కళ్లముందు జరిగేదంతా నీవు చూస్తావు, వింటావు" అని అన్నాడు.
పిల్లల్నెవరు చూసుకుంటారు..?
ఏడుస్తూ మందు చేతిలోకి తీసుకున్న సింహబలుడి భార్య.. కాసేపు ఆలోచించి "నా భర్త కోసం నేను మరణించేందుకు సిద్ధమే. కానీ నేను లేనిదే ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు..? కనీసం పిల్లల కోసం అయినా తాను జీవించి ఉండాల్సిందే కదా స్వామీ..!" అంటూ రోదిస్తూ బదులిచ్చింది..


సింహబలుడు గురువు చెప్పినట్లుగానే ఇంటికివెళ్లి.. ఆయన ఇచ్చిన మాత్రలు మింగి స్పృహతప్పి మంచంపై పడుకున్నాడు. అతని తల్లి, భార్య అందరూ దుఃఖిస్తూ పక్కనే కూర్చున్నారు. ఇంతలో అతని గురువు వైద్యుడి వేషంలో అక్కడికి వచ్చాడు. సింహబలుడి నాడిని పరీక్షించిన అతను.. ఇతడిని బ్రతికించేందుకు తన వద్ద మందు ఉందని చెప్పాడు. అది విన్న శిష్యుడి భార్య, తల్లి ఆనందానికి అవధే లేకుండా పోయింది.

"అయితే ఆ మందు పనిచేయాలంటే.. అందులో సగం ముందుగా రోగి బంధువులు ఎవరైనా మింగాలనీ.. మిగిలిన సగం భాగం రోగికి తాగిస్తేనే అతడు బ్రతుకుతాడని.. ముందుగా మందు తాగినవారు చనిపోతారని" కిటుకు పెడతాడు గురువు ధనంజయ ముని. కాబట్టి.. సింహబలుడిపై ప్రేమ కలిగిన వారెవరయినా ముందుకొచ్చి, మందుతాగి అతడిని బ్రతికించమని కోరతాడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.