కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » పుస్తకాల మోత, హోంవర్క్‌లు లేకపోతే ఎంత బాగుంటుందో...!! (Stories | School | Pranavi | Donkey | Mother | Father | Teacher | Sister | Brother | Home Work | Books)
Bookmark and Share Feedback Print
 
Student
FILE
ప్రతిరోజూ స్కూలుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు స్కూలు దగ్గర ఒక గాడిదను చూస్తుంటుంది ప్రణవి. అది నిశ్చింతగా నీడపట్టున నిల్చుని అరమూసిన కళ్లతో ఆనందిస్తూ ఉంటుంది. "అబ్బా.. ఈ గాడిదకు ఎంత సుఖం. చదవనక్కరలేదు, పుస్తకాలు మోయనక్కరలేదు, హోంవర్క్‌లు ఉండవు.. క్లాసులో టీచర్ల, ఇంట్లో అమ్మానాన్నల తిట్లు.. ఇవేమీ ఉండవు కదా..!" అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రణవి.

"తనకు మాత్రం చదువు, ఇంత బరువు ఎందుకు? గాడిదకు మాత్రం అంత సుఖం దేనికి..?" మనసులో ప్రశ్నించుకుంది ప్రణవి. ఆ ఆలోచనలతోనే ఇంటికి చేరి, భోంచేసి నిద్రపోయిన ఆ అమ్మాయికి నిద్రలో దేవుడు కల్లోకి వచ్చాడు.

"నీకు మంచి అమ్మానాన్నలను ఇచ్చాను. అక్కా, తమ్ముళ్లు, తాతత్య, నాయనమ్మ.. ఇలా అందర్నీ ఇచ్చాను. స్కూల్లో టీచర్లు చక్కగా చదువు చెబుతారు, ఇంట్లో అమ్మ హోంవర్క్ చేయిస్తుంది. స్కూల్లో నీకు మంచి పేరు కూడా ఉంది. మరి అలాంటప్పుడు నువ్వు పదే పదే ఆ గాడిద గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని" అడిగాడు దేవుడు.
గాడిద బ్రతుకు వద్దు స్వామీ..
ఏమ్మా ప్రణవీ.. ఇకపై కూడా గాడిదలాగా ఉండదల్చుకున్నావా..?" అని అడిగాడు దేవుడు. "అయ్యో.. వద్దు స్వామీ.. నేను అమ్మకూతురిలాగే ఉంటాను. చక్కగా చదువుకుంటాను. వేడి అన్నం, మిఠాయిలు తింటాను. నాకు అందరి ప్రేమా కావాలి. గాడిద బ్రతుకు వద్దే వద్దు స్వామీ..!!" అంటూ


"లేదు స్వామీ.. ఆ గాడిద చాలా సుఖంగా ఉంది. దానికి చదువక్కరలేదు, పనిలేదు, తిని హాయిగా పడుకుంటుంది. ఆ గాడిదలాగా నన్ను మార్చేసేయ్.. నాకు ఈ చదువుల బాధలన్నీ తప్పుతాయని" ప్రాధేయపడింది ప్రణవి. "తొందరపడకురా బంగారూ.. ఏదయినా అడిగేటప్పుడు ఆలోచించి అడగాలి, లేకపోతే చీమ కథలా అవుతుంది, ఆ తరువాత నువ్వే బాధపడతావు" అన్నాడు దేవుడు.

"చీమ కథలాగానా..? అసలు ఆ చీమ కథేంటి..?" ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి.

"ఒకసారి ఓ చీమకు వరమిచ్చాను. అది కంగారుగా, ఏమీ ఆలోచించకుండా 'నేను కుట్టగానే చావాలి' అని కోరుకుంది. అయితే దాని ఉద్దేశ్యం ఏంటంటే తాను కుట్టినవాళ్లు వెంటనే చావాలని. అయితే అది కంగారుగా అడగటంవల్ల 'కుడితే తనే చావాలి' అనే అర్థం వచ్చేటట్లుగా అడిగింది. అందుకనే చీమ కుట్టగానే ఎవరైనా కుట్టినచోట కొట్టుకుంటారు. వెంటనే అది చస్తుంద"ని చెప్పాడు దేవుడు.

అయినా సరే ప్రణవి ఒప్పుకోలేదు. "అయితే సరి.. నిన్ను ఒక్కరోజు గాడిదను చేస్తాను. నీకు నచ్చితే అలాగే ఉందువుగానీ..!!" అని ప్రణవితో అన్నాడు దేవుడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.