ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » నా సొమ్ముకూడా నువ్వే తీసేసుకో నాయనా..!! (Stories | Viratapuram | King | Horse | City | Streets | People | Happy | Old Woman | King's Palace)
విరాటపురం రాజు ఓ రోజు గుర్రమెక్కి తన పరివారంతో నగర సందర్శనానికి బయలుదేరాడు. తన పాలనలో నగరమంతా సంతృప్తిగా జీవిస్తోంది. వీధులన్నీ చక్కగా పరిచినట్లుగా అందంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆనందంతో తుళ్లుతూ కనిపించారు. ఎవరైనా ప్రజలను ఆపి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, "మీ పాలనలో సమస్యలా ప్రభూ..!!" అంటూ ఎదురు ప్రశ్నిస్తుండటంతో రాజుకు చాలా సంతోషమేసింది.
ప్రజల జవాబుతో మనసంతా ఆనందంతో నిండిపోగా, తిరిగి రాజభవనానికి తిరుగుముఖంపట్టాడు రాజు. అలా వెళ్తుండగా దారిప్రక్కన ఓ చెట్టుకింద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఓ ముసలావిడ కనిపించింది. వెంటనే తన పరివారకులను ఆపమని చెప్పిన రాజు.. "ఏంటవ్వా.. ఇక్కడ కూర్చున్నావు.. నీకు ఇల్లు లేదా..?" అని అడిగాడు.
"ఈ లోకమే నాకున్న ఇల్లు, ఈ ప్రజలందరూ నా వాళ్లే"నంటూ వేదాంత ధోరణిలో రాజుకు బదులిచ్చింది ఆ ముసలావిడ. దీంతో వెంటనే రాజుకు చాలా జాలేసింది. "నువ్వు నాతో రా అవ్వా" అంటూ ఆమెను తనతోపాటు రాజభవనానికి తీసుకెళ్లేందుకు వెంటనే సేవకులను పల్లకి తెమ్మనిచెప్పి అందులో ఎక్కించి తీసుకురమ్మని బోయీలకు చెప్పాడు.
ఇంతలో రాజభవనం రానే వచ్చింది. భవనం మధ్యలో ఒకచోట ముసలావిడను కూర్చోబెట్టి, తాను ఇప్పుడే వస్తానని చెప్పి లోనికి వెళ్లాడు రాజు. భవనాన్నంతా పరికించి చూస్తున్న ముసలావిడకు లోపలి పూజామందిరంలోంచి దేవుడిని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి గొంతు వినిపించింది. మెల్లిగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది.