కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » ఈ బిరుదానికి మీరే తగినవారు.. నేను కాదు..!! (Stories | Himavantudu | King | Jokers | Gold Medal | Horse | Elephant)
Bookmark and Share Feedback Print
 
King
FILE
పూర్వకాలంలో హిమవంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగే అతనెప్పుడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ప్రతిరోజూ విలాసాల్లో తేలిపోతుండేవాడు. ఆ రాజుకు తన సుఖం తప్ప, రాజ్య ప్రజలు ఎలా బ్రతుకుతున్నా పట్టేది కాదు. విలాస పురుషుడైన ఆ రాజు, తనకు తోచినప్పుడు వినోదాన్ని అందించేలాగా ఓ ఇద్దరు హాస్యగాళ్లను కూడా రాజ మందిరంలో ఉంచుకున్నాడు.

ఆ ఇద్దరిలోనూ ఎక్కువగా హాస్యాన్ని అందించే ఒకడికి "ఉత్తమ అవివేకవంతుడు" అనే బిరుదాన్నిచ్చాడు. అంతేగాకుండా ఆ పదాలను ఒక బంగారు పతకంలో చెక్కించి ఆ పతకాన్ని బిరుదుపొందిన హాస్యగాడి మెడలో తగిలించాడు రాజు హిమవంతుడు. అలా కాలం గడుస్తుండగా రాజు ముసలివాడు అయ్యాడు. వ్యాధితో మంచపట్టాడు.

ఓ రోజు ఉత్తమ అవివేవవంతుడికి కబురు పంపించాడు హిమవంతుడు. "బ్రతికినంతకాలం నాకు లెక్కలేనంత హాస్యాన్ని అందించిన మిత్రమా..?! ఇక నేను వెళ్లిపోతున్నాను" అన్నాడు రాజు బాధగా.

వెంటనే అందుకున్న ఉత్తమ అవివేకవంతుడు "మహారాజా.. గుర్రపు బగ్గీ కట్టించేదా..?" అని అడిగాడు "ఒరేయ్ అవివేకి.. బుద్ధిహీనుడా.. నేను వెళ్లేచోటికి గుర్రపు బగ్గీలపై వెళ్లరు" అని అన్నాడు.

"అవునా ప్రభూ.. సరే అయితే ఏనుగును తెప్పించేదా..?" మళ్లీ అడిగాడు అవివేకి. "అబ్బా.. ఓరీ మూర్ఖా, అక్కడికి ఏనుగుపై కూడా వెళ్లరురా..?" గట్టిగా అరిచి చెప్పాడు రాజు హిమవంతుడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.