ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కళలు మరియు సంస్కృతి > నెల్లూరులో "నంది నాటకోత్సవం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నెల్లూరులో "నంది నాటకోత్సవం"
FILE
జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో "నంది నాటకోత్సవం-2008" జరుగనుంది. ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర సమాచార శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ... నంది నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 ఎంట్రీల నుండి 32 నాటకాలను ఈ ఉత్సవాలకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.

వీటిలో ఉత్తమ నాటకాలుగా ఎంపికైన వాటికి 24వ తేదీన జరిగే సభలో నంది బహుమతులను ప్రదానం చేస్తామని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఉత్సవాల నిర్వహణకుగానూ 26 లక్షల నిధులతో కస్తూరిబా కళాక్షేత్రానికి మెరుగులు దిద్దినట్లు ఆయన తెలియజేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కూచిపూడి నాట్యానికి పురస్కారం: బుద్ధప్రసాద్
ఇజ్రాయెల్‌లో భారత్ నృత్యాలకు ఆదరణ
సాంస్కృతిక శాఖ సౌజన్యంతో "భాషోత్సవాలు"
ఆసియా బుకర్ రేసులో కావేరి నంబిసాన్
ఆంగ్ల సంస్కృతిని వదిలించుకోవాలి
భారత్-పాక్ మ్యూజిక్ ఫెస్టివల్ షాన్జ్ 2008