ప్రధాన పేజి » ఇతరాలు » సాహిత్యం » కళలు మరియు సంస్కృతి » తెలుగువాడిని తట్టి లేపే తెలుగు తూటా.. గజల్ శ్రీనివాస్ (వాడు తెలుగోడే వీడియో) (Dr Ghazal Srinivas | Vadu Telugode Song | Video | Telugu Culture)
తెలుగువాడిని తట్టి లేపే తెలుగు తూటా.. గజల్ శ్రీనివాస్ (వాడు తెలుగోడే వీడియో)
శనివారం, 11 ఫిబ్రవరి 2012( 13:01 IST )
గిన్నిస్ రికార్డు గాయకుడు గజల్ శ్రీనివాస్ పాట గురించి మరో మాట చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన పాటలోని మాట అంత సూటిగా చురుక్కుమనిపిస్తుంది మరి. సమాజంలోని రుగ్మతలను, సమస్యలను ఎత్తి చూపుతూ పాలకులను మేలుకొలిపే గాయకుడు గజల్ శ్రీనివాస్ అంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు ఆయన తెలుగువాడి పని పట్టేందుకు నడుం బిగించారు. తెలుగువాడి తెలుగు భాషతో పాటు అతడి వేషం ఎలా మారిపోతుందో.. పాశ్చాత్యుల ప్రభావం మూలంగా తెలుగువాడు.. మెలమెల్లగా తెలుగువాడి తేజస్సును ఎలా మసకబారుస్తున్నాడో కళ్లకు కట్టినట్లు తన పాట ద్వారా చెప్పారు.
ఇది పాట కాదు.. తెలుగువాడి హృదయాన్ని తట్టి లేపే తెలుగు తూటా. గజల్ వారి ఈ పాటను వినండి