ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > పుస్తక సమీక్ష > "మహాత్ముడి రచన"లను ఎవరైనా ముద్రించవచ్చు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"మహాత్ముడి రచన"లను ఎవరైనా ముద్రించవచ్చు
FILE
జాతిపిత మహాత్మాగాంధీ రచనలను ఇకమీదట ఎవరైనా ముద్రించుకోవచ్చు. గాంధీజీ రచనలపై నవజీవన్ ట్రస్టుకు ఉన్న కాపీరైట్ హక్కు జనవరి 1, 2009తో ముగిసిపోవడం వల్ల, ముద్రణాకర్తలు ఎవరైనా సరే ఆయన రచనలను ముద్రించుకునే హక్కులు కలిగి ఉంటారు.

ఈ విషయమై నవజీవన్ ట్రస్టు ఛైర్మన్ జితేంద్ర దేశాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... జనవరి ఒకటవ తేదీ, 2009 నుంచి మహాత్ముడు రచించిన పుస్తకాలను ముద్రణాకర్తలు ఎవరైనా తిరిగి ముద్రించుకోవచ్చునని తెలిపారు. దీనికోసం గాంధీజీ నెలకొల్పిన "నవజీవన్ ముద్రాలయ" ట్రస్టును కూడా సంప్రదించాల్సిన అవసరం లేదని, రాయల్టీ చెల్లించాల్సిన పని లేదని చెప్పారు.

ఇదిలా ఉంటే... గాంధీజీ కేవలం అయిదు పుస్తకాలను మాత్రమే రాశారు. అయితే వివిధ అంశాలపై నవజీవన్, యంగ్ ఇండియా, హరిజన్ ముద్రణా సంస్థల ద్వారా ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. వీటితో దాదాపు 100కు పైగా పుస్తకాలుగా రూపొందాయని జితేంద్ర ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా, భారత కాపీరైట్ చట్టం ప్రకారం రచయిత మరణించిన 60 సంవత్సరాలదాకా... అతడి రచనలకు కాపీరైట్ వర్తిస్తుంది. దీంతో మహాత్ముడు మరణించి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తవడంతో ఆయన రచనలకు ఉన్న కాపీరైట్ హక్కు ముగిసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
'క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' రచయిత మృతి
తెలుగు టాకీ వెలుగు నీడలు
దాస్ కాపిటల్ కామిక్ వెర్షన్ విడుదల
ప్రచురణల రంగంలో ఒబామా బూమ్
నోబెల్ అవార్డు గ్రహీత గోర్డీమెర్ భారత్ రాక
అరవింద్‌లో రచనాసక్తికి ఆస్ట్రేలియా తోడ్పాటు