|
సెక్సీ డ్రెస్సు చేసిన ఘోరం
|
 |
|
|
|
|
|
|
బుధవారం, 21 మే 2008( 13:36 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | డైరెక్టర్ సూచనల మేరకు ఎంతో వయ్యారంగా నటిస్తోంది రమణి. రమణి డ్రస్సు ఎంతో సెక్సీగా ఉంది. దానికి తోడు ఆమె నటన మరీ సెక్సీగా ఉంది. "కట్!" అరిచాడు డైరెక్టర్ శేఖర్. శేఖర్ తీసిన సినిమాలంటే ఎగబడి మరీ చూస్తారు ప్రజలు. అందుకు ముఖ్య కారణం అతడు తీసిన సినిమాల్లో హీరోయిన్స్‌ని ఎంతో సెక్సీగా చూపించడమే. శేఖర్ సినిమాల్లోని హీరోయిన్స్‌లా అలంకరించుకొని తిరగడం ప్రస్తుత కాలేజీ బ్యూటీలకు క్రేజీ. కేవలం కాలేజీ బ్యూటీలేకాదు... బయటి బ్యూటీలు కూడా శేఖర్ హీరోయిన్స్‌ను అనుకరించసాగారు. రమణి నెక్స్ట్ సీన్‌కి రడీ అయింది. "స్టార్ట్! యాక్షన్!" మెగాఫోన్‌లో అరిచాడు శేఖర్. ఎంతో సెక్సీగా నటిస్తోంది రమణి. ఆ దృశ్యాన్ని మౌనంగా తనలో దాచుకుంటోంది మూవీ కెమెరా.
"కట్! లంచ్ బ్రేక్" అన్నాడు శేఖర్. యూనిట్ సభ్యులందరూ ఆహారం కోసం ఎగబడ్డారు. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, స్పెషల్ రూంలోకి వెళ్ళారు స్పెషల్ ఫుడ్ కోసం. రమణి డ్రస్సుమీద జోకులేస్తూ టేకులెలా తీసింది చెప్తూ భోజనం చేస్తున్నాడు శేఖర్. అప్పుడు ..."సార్! మీకు అర్జంట్ ఫోన్" అంటూ శేఖర్‌తో చెప్పాడు అతని అసిస్టెంట్.
"నాకా! అర్జంటా!" అని ఆశ్చర్యపోతూ "వస్తున్నా" అంటూ ఆందోళనతో పైకి లేచాడు శేఖర్. రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొని.." శేఖర్ స్పీకింగ్" అన్నాడు. "సార్! నేను టూ టౌన్ ఎస్.ఐని మాట్లాడుతున్నాను. మీరు అర్జంటుగా స్టేషన్‌కి రావాలి. ఫోన్లో చెప్పే విషయం కాదు". విన్పించింది అవతలి కంఠం. 'ఏమిటంత అర్జంటు ఏమైవుంటుంది?' అనుకొని అలాగే అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
|