ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కథలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంతరాత్మ నిర్ణయంతో విజయం  Search similar articles
FILE
అది ఆదివారం అర్థరాత్రి సమయం. కటిక చీకటి.... రోడ్డు ఇరు వైపుల ఉన్న పొడవైన చెట్లు పురివిప్పుకుని తాండవిస్తున్న భూతల సవ్వడి చేస్తున్నాయి. ఆ వేళలో ఎటువంటి భయం లేకుండా వెలుతురు కంటే కూడా వేగంగా దూకువెళుతోంది ఓ యువతి. ఆమె పేరు జనని

ఎలాగైనా చనిపోవాలి... నడుస్తున్న ఆమె ఎంతో స్థిరంగా అనుకుంది. అయితే ఎలా చనిపోవాలి? వెంటనే ప్రశ్నించుకుంది. నడుస్తూనే ఆలోచించింది. ఊరికి దూరంగా వున్న పాడుబడిన బావిలో దూకి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నడక వేగాన్ని మరింత పెంచింది. వేగంగా నడుస్తున్న ఆమె కంటికి బావి కన్పించింది. అంతే క్షణంలో బావి గట్టు మీద నిల్చుని భగవంతుడా 'నేను చేసిన తప్పుకి ఇదే శిక్ష' నాకు ప్రశాంతమైన చావును అందించు అంటూ తన ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించి బావిలోకి దూకేసింది.

నీళ్ళలో పడేలోపే... ఒక్కసారిగా మెలకువ వచ్చి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంది. ఓస్ ఇదంతా కలన్న మాట? అనుకుంది. వెంటనే.. కలలోనే కాదు నిజంగానైనా కిషోర్ విషయం తల్లిదండ్రులకు తెలిసిన రోజు జరగబోయేది కూడా ఇంతే కదా అనుకుంది. అందరి ముందూ ఎంతో గొప్పగా, గర్వంగా తలెత్తుకుతిరిగేవాడ్ని అలాంటి నన్ను ఈ రోజు అందిర ముందూ తలదించుకునేలా చేశావు కదే... అంటాడు తండ్రి.

దాన్ని గురించి ఇంకా ఎందుకండీ మాట్లాడడం? అది చచ్చిందనుకుంటే సరిపోతుంది అంటుంది తల్లి. చచ్చిందనుకుంటే సరిపోదు. నిజంగా చనిపోతేనన్నా మన పరువు కొద్దిగానన్నా మిగుల్తుంది అంటాడు తండ్రి. కనుక అప్పుడైనా చావక తప్పదు. ఎలాగూ చావాలి కనుక కిరణ్ విషయం తల్లిదండ్రులకు తెలియకముందే చెప్పేస్తే? అనుకుంది జనని. చచ్చి ఏం సాధిస్తావే పిచ్చిదానా వెంటనే ప్రశ్నంచింది జనని అంతరాత్మ.

అవును. చచ్చేం సాధిస్తాను? ఏమీ సాధించలేను. కిరణ్‌కేం హాయిగా వుంటాడు. నో ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అని తీవ్రంగా ఆలోచించసాగింది. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్నది అర్థగంట ఆలోచనల తర్వాత నిర్ణయించుకొంది. అంతే ఒక్క ఉదుటున అర్థరాత్రి సమయంలో మంచం దిగింది. ఆడది అబల కాదు. ఆడదాన్ని మోసం చెయ్యడం తేలిక కాదని నిరూపిస్తాను అని స్థిరంగా అనుకుంది. తల్లికీ, తండ్రికి తెలియకుండా మెల్లగా ఇంటిలోంచి బయటపడింది. కిషోర్ పెళ్ళి తెల్లవారుజామున నాలుగు గంటలకు.
1 | 2 | 3  >>  
మరిన్ని
సెక్సీ డ్రెస్సు చేసిన ఘోరం
మలుపు
మార్పు
మేడమీది గది
పాపం ప్రజలు
కాకి సాక్షిగా