కానీ ఎలా? ఎలా? ఎప్పుడు... అప్పుడు గుర్తొచ్చాడామెకు కాము. వాడి పేరు కామేశ్వర్‌రావు. అయితే అంతా వాణ్ణి కాము అంటూ పిలుస్తుంటారు. బలిష్టమైన శరీరం, రోజుకు అయిదో, పదో సంపాదించుకుందుకో రిక్షా| అంతకు మించి వాడివి అంటూ చెప్పుకోవడానికి మరేమీ లేవు.
ప్రతిరోజూ తమ ఇంటిముందున్న చెట్టుకిందే వాడు రిక్షా పెట్టుకుంటాడు. ఇన్నాళ్ళూ వాడి మీద తనకా ఆలోచలే కలగనందుకు తనను తాను తిట్టుకుంది సౌందర్య. వాంఛతో పొంగుతున్న తన శరీరాన్ని అదుపులో పెట్టగలిగే మగాడి కోసం కాదు. మృగంలాంటి సంఘాన్నుండి రక్షణ ఇవ్వగలిగితే చాలు... సౌందర్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తన కులాన్ని, భేషజం నిండిన తన ఇంటి వాతావరణాన్ని చూసి కాము తనని కాదంటాడేమో. అతడు మనసు పడేలా చేయి తండ్రీ.. అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించింది సౌందర్య. |