ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కథలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాధా- రవిల సుఖ సంసారం  Search similar articles
WD
కుడిచేత్తో ఆమె చెక్కిళ్ళు స్పృశిస్తూ ఊహాలోకాల్లో విహరిస్తున్న రవికి ఎడమ చేతిలోని సిగరెట్ చివరికంటా కాలి వేళ్ళను చురుక్కుమనిపించగానే వాస్తవంలోకి అడుగు పెట్టాడు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం రవి, రాధల దాంపత్యం అని చుట్టుప్రక్కల ఫ్లాట్స్‌లోని వారు కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే విశేషం. నిజంగా కూడా వారిది అన్యోన్య దాంపత్యం. వారిది ప్రేమ వివాహం. ఆ అన్యోన్య దాంపత్యం వారంరోజుల నుంచి కొద్దిగా పెడ మొఖం అయింది. పెళ్ళికి కొద్ది ముందుగా వారి జీవితంలోకి తొంగి చూస్తే...

అవి రవి తిరుపతిలో కాలేజీ చదివే రోజులు. ఎంతో అల్లరి చిల్లరగా స్నేహితులతో తిరుగుతూ కూడా చదువు విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా బి.ఎస్.సి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఎమ్.ఎస్.సి రెండో సంవత్సరం చదివే రోజుల్లో ప్రక్క ఇంటి మాస్టారుగారి కూతురు రాధతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఎమ్.ఎస్.సి పూర్తి అయ్యేప్పటికి స్థిరమైన ప్రేమగా మారింది. అయినా రవి చదువు మాత్రం పాడవకుండా ఎమ్.ఎస్.సి ఫస్ట్ క్లాస్‌తో పూర్తి చేశాడు.

ఎలాగైనా రాధను పెళ్ళిచేసుకోవాలన్న పట్టుదలతో రవి ఇంట్లో పెద్దలను ఒప్పించి మాస్టారుగారింటికి సంబంధం కోసం పంపితే మాస్టారుగారు "డబ్బుకు నేను తక్కువేమో గానీ కులానికి తక్కువకాదు. కనుక వేరే కులంలో మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయను" అని కులం మీద ఓ అరగంట లెక్చరిచ్చి పంపాడు. గత్యంతరం లేక రవి మిత్రుల సహాయంతో రాధను వివాహం చేసుకున్నాడు.

చదువుకున్న కొడుకు ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడని రవి తండ్రే వారి సంసారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేశాడు. అప్పుడే రవికి బొంబాయిలో పెద్ద కంపెనీలో చీఫ్ కెమిస్టుగా ఉద్యోగం వచ్చింది. రాధతోసహా రవి మకాం బొంబాయిలోని ఓ ఫ్లాటులోకి మార్చాడు.
1 | 2  >>  
మరిన్ని
జీవితానికి ఓ తోడు
కాకితో సినీ క్లైమాక్స్
అంతరాత్మ నిర్ణయంతో విజయం
సెక్సీ డ్రెస్సు చేసిన ఘోరం
మలుపు
మార్పు