ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కథలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాధా- రవిల సుఖ సంసారం
సెలవు రోజుల్లో ఎంతో జాలీగా రాధతో సిటీలంతా తిరుగుతూ, క్రొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ సాయంకాలం మంచి హోటల్‌లో డిన్నర్ ముగించి ఇంటివద్ద సుఖంగా కాలం గడిపేవారు. అలా సంతోషంగా కాలం గడుపుతున్న సందర్భంలో తాను తల్లికాబోతున్నానని తెలుసుకుంది రాధ. ఆసంతోష వార్త ఎంత తొందరగా రవి చెవిలో వేద్దామా అని సాయంకాలం వరకు నిరీక్షించిన తర్వాత రవి ఇంట్లో అడుగు పెట్టగానే అతన్ని పెనవేసుకుని గుసగుసగా చెప్పింది. రవి విసుక్కుంటూ "రెండు సంవత్సరాల వరకు వద్దన్నాను కదా? ఉదయం డాక్టర్ వద్దకు వెళ్ళి అబార్షన్ చేయించుకుందాం" అన్నాడు.

అందుకు రాధ మనస్సు ఏకీభవించలేదు. అదే వారిద్దరి పోట్లాటకు మొదటి ఘట్టం. వారంరోజులు ఎడమొఖం పెడమొఖంగా వారి సంసారం జరిగిన తర్వాత "నీ నిర్ణయం మార్చుకోవా?" అన్నాడు రవి. బదులుగా రాధ "నా నిర్ణయం మారదు. మీకు ఇష్టం లేకపోతే" తర్వాత ఏమి మాట్లాడుతుందో కూడా వినకుండా బయటకు వెళ్ళాడు రవి.

రెడ్‌లైట్ ఏరియాలో ఓ ఇంటిముందు నిలబడ్డం చూసి "రా గురూ! చాలా గంటలుగా ఎవరూ తోడులేక బోర్ కొడుతోంది" అని ఓ సుందరి ఆహ్వానించింది. రోజూ నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఎంతో బోర్ రాధ అనుభవిస్తుంటుంది కదా ఓ పాపో, బాబో రాధకు తోడుగా ఉంటే కాలక్షేపంగా ఉంటుందని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సిగరెట్ పీక చురుక్కుమన్పించడంతో వాస్తవంలోకి వచ్చాడు.

పూలు మరియు స్వీట్ ప్యాకెట్స్‌లో ఇంటికి రావడం చూసి "ఇవన్నీ ఎందుకండీ?" అని రాధ ప్రశ్నిస్తుంటే పుట్టేది బాబా? పాపా? అని ఆలోచిస్తూ, రెండు చేతుల్తో ఆమె చెక్కిళ్ళను స్పృశిస్తూ "నీ శ్రీమంతానికోయ్" అన్న రవి పెదాలను ముద్దాడుతూ గట్టిగా కౌగిలించుకుంది.
<< 1 | 2 
మరిన్ని
జీవితానికి ఓ తోడు
కాకితో సినీ క్లైమాక్స్
అంతరాత్మ నిర్ణయంతో విజయం
సెక్సీ డ్రెస్సు చేసిన ఘోరం
మలుపు
మార్పు