ప్రేమానందస్వామి బోధనలు వినేందుకు వచ్చే జనంలో పిల్లలే ఎక్కువ సంఖ్యలో వుంటారు. అందుకు కారణం బోధనలు పూర్తయిన తర్వాత బాలలకు స్వామి ప్రత్యేకంగా పైవ్‌స్టార్ చాక్లెట్లు యివ్వడమే. స్వామి వారు ఏకాంతంలో వుండగా కూడా బాలలెవరైనా వస్తే వారితో నవ్వుతూ మాట్లాడి చాక్లెట్ యిచ్చి పంపుతాడు.
ఓరోజు స్వామివారు ఏకాంత సమయంలో వుండగా బాబు అనే ఎనిమిదేళ్ళ బాలుడు వచ్చాడు. " రాబాబూ" అని నవ్వుతూ పిలిచాడు బాలానంద స్వామి. దాదాపు అరగంటసేవు స్వామిని రకరకాల ప్రశ్నలు వేశాడు బాబు. ఓపికగా సమాధానం చెప్పాడు స్వామి. తర్వాత బాబు చేతికి ఫైవ్‌స్టార్ చాక్లెట్ యిచ్చాడు. అప్పుడు.... తరుణ్ అనే ఓ ముప్పయి సంవత్సరాల భక్తుడు ప్రవేశించి... మీరు చాక్లెట్లు యిచ్చేది పిల్లలకేనా? మాలాంటి భక్తులకు కనీసం మీ దర్శనం కూడా కష్టమే. ఎందుకు స్వామీ ఈ తేడా? అని ప్రశ్నించాడు.
పిల్లల్ని ఆనందంపరచడమేనా నాధ్యేయం. అన్నాడు నవ్వుతూ స్వామీజీ. చాక్లెట్లు లేకపోయినా తీర్థ ప్రసాదాలయినా మాకివ్వవచ్చుగా అన్నాడు తరుణ్. మీకు తీర్థప్రసాదాలు యిచ్చేందుకు ఎందరో వున్నారు.. వీళ్ళకు లేరుకాబట్టే నేనిస్తున్నాను అంటూ బాబు వైపు చూపించాడు స్వామీజీ... అటువైపు చూసిన తరుణ్ కంటికి ఆవురావురు మంటూ చాక్లెట్ తింటున్న బాబు కన్పించాడు. కొన్ని ఆథ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని వెళ్ళిపోయాడు తరుణ్.
|