ఏంటే మొద్దూ... ఏదో ఆలోచిస్తూ వున్నావ్? నా ఆలోచనల్ని చెదరగొడుతూ ప్రశ్నిచింది సుమ. నేనేం జవాబు చెప్పలేదు.ఏయ్ నిన్నే అడిగేది... కొంచెం గట్టిగా అడిగింది. ఏం లేదే... అన్నాను నేను.ఆహా ఏమీ లేకపోవడమేమిటి? ఇంకొద్ది సేపట్లో శోభనం గదిలోకి వెళ్ళబోతున్నావు కదా దాని గురించే ఆలోచిస్తూ వుండి వుంటావు కొంటెగా మాట్లాడింది సుమ. ప్రక్కనున్న మిగిలిన స్నేహితురాళ్ళు కూడా సుమ మాటలకు నవ్వి నన్ను కవ్వించసాగారు.నిజంగా నా ఆలోచనలు మాత్రం శోభనం మీదలేనే లేవు. ఈ విషయం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకనే చెప్పలేదు.కొద్ది సేపటికి తెల్లచీర, మల్లెపూలతో అలంకరించారు నన్ను. చేతికి పాలగ్లాసు ఇచ్చి పడగ్గది తలుపువరకు సాగనంపారు స్నేహితురాళ్ళు మరియు బంధువులు.గదిలోకి అడుగుపెట్టిన నా మనసంత అదోలా తయారైంది. జీవితంలో ఒకే ఒక్కసారి తప్ప ఎప్పుడూ రానిరోజిది. కానీ లోపల నా కోసం ఎదురు చూస్తున్న అతనికో? అని ప్రశ్నించుకున్నాను. అతనికిది రెండోసారి... అని జవాబిచ్చింది అంతరాత్మ.నిజమే అతనికి నాతో రెండవ వివాహం. తెలిసే చేసుకున్నాను. ఇందులో నా తల్లిదండ్రుల బలవంతం ఏమీ లేదు. అంతా నా యిష్ట ప్రకారమే జరిగింది.రెండునెలల క్రితం...రాఘవయ్యగారూ, మంచి సంబంధం ఉంటే చెప్పమని ఎప్పటినుంచో అడుగుతున్నారుగా. ఇదిగో... అబ్బాయి గుణవంతుడు, మంచి ఉద్యోగం... అంటూ శాస్త్రుల వారు యింట్లోకి ప్రవేశించాడు.కట్నం ఏ మాత్రం అడుగుతున్నారు? ఆడపిల్ల తండ్రి వేయాల్సిన సర్వసాధారణ ప్రశ్న మా నాన్న కూడా వేశారు. కాణీ కట్నం కూడా వద్దంటున్నాడు అన్నాడు శాస్త్రులు.ఏం ఎందుకని అబ్బాయికీ ఏమన్నా లోపమా? ప్రశ్నించాడు నాన్నఏ లోపమూ లేదు. చక్కని పర్సనాలిటీ. కాకపోతే పెళ్ళయిన రెండేళ్ళకే భార్య చనిపోయింది.చాల్లేవయ్యా... రెండో పెళ్ళి సంబంధం, మంచి సంబంధమా... శాస్త్రుల్ని మాట్లాడనివ్వకుండా మధ్యలో అందుకుని కోపంగా చెప్పేశాడు నాన్న. దాంతో వెళ్ళిపోయాడు శాస్త్రులు.శాస్త్రులుగారు మంచి ఉద్యోగం, మంచి అబ్బాయి అంటున్నారు. మీరేమో వద్దంటున్నారు అని మెల్లగా నాన్న దగ్గర మాట్లాడింది అమ్మ. రెండో పెళ్ళివాడ్ని నా కూతురికి కట్టబెట్టాల్సిన ఖర్మ నాకు లేదు అన్నారు నాన్న. సంబంధం మంచిదైనప్పుడు ఎందుకు వదులుకోవాలి. అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది కదా... అంది అమ్మ. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |