" జీవితం ప్రేమమయం" అని ఊహాలోకాల్లో విహరించేదాన్ని. అదే సమయంలో .. నా మనసు దోచుకున్నాడు రవి. అతని కోసం తల్లిదండ్రులను ఎదిరించి అతనితోనే వెళ్ళిపోయి వివాహం చేసుకున్నాను. వివాహం అయిన వెంటనే "మనం ఇక్కడ వుంటే ప్రమాదం. బొంబాయి వెళ్ళిపోయి బ్రతుకు తెరువు చూసుకుందాం" అన్నాడు.శోభనం కోసం బొంబాయిలో పెద్ద హోటల్‌లో రూం బుక్ చేసాడు. ఆ గది శోభాయమానంగా అందంగా అలంకరించి ఉన్నది. రవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తలుపు శబ్దమయింది. అటు చూసేసరికి వేరెవ్వరో లోపలికి వస్తున్నారు. అడిగితే ..." నిన్ను నాకు అమ్మేశాడు" అని అన్నాడు.పూర్తిగా మోసపోయానని తెలుసుకున్నాను. నేనలాంటిదాన్ని కాదని నా కథ పూర్తిగా అతనికి చెప్పుకున్నాను. అదృష్ట వశాత్తు అతను ఏమీ చేయక "చూడమ్మా ఈ రవి పెద్ద బ్రోకర్. నీ లాంటి అమాయకుల్ని మోసంచేసి అమ్మేస్తుంటాడు. ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేదంటే రేపు వ్యభిచార గృహాలకు అమ్మేస్తాడు. " అని ఆమెను అక్కడ నుంచి పంపేశాడు. ఎలాగో రైల్వే స్టేషనుకు చేరుకున్న రాజీ కదులుతున్న బండిని ఎక్కేసింది. ఆమెను అదేపనిగా చూస్తోంది సరస్వతి అనే మహిళ. "నేను ఎక్కేసరికి రైలు కదులుతూ ఉందండీ. టిక్కేట్ తీసుకునే సమయం కూడా లేదు... అందుకే ఎక్కేశాను" అంటూ తన దీన గాధను ఆమెతోతో చెప్పుకుంది రాజీ. |